సిఐటియు ఆధ్వర్యంలో విద్రోహ దినం నిరసనవ్యక్తం చేశారు

Published: Tuesday February 01, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం అంబేద్కర్ చౌరస్తా  విగ్రహం దగ్గర ప్లకార్డులతో ఈరోజు జనవరి 31న విద్రోహ దినం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు మండల, మున్సిపల్ కన్వీనర్లు. బుగ్గరాములు, సిహెచ్. ఎల్లేశ మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని వహించడం పై జనవరి 31న దేశవ్యాప్తంగా విద్రోహదినం జరపాలని రైతు. కార్మిక. కర్షక. విద్యార్థులు. మేధావులు. కలిసి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా గండిపేట మండల సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉద్యమంలో రైతులపై బనాయించిన కేసులను వెంటనే ఎత్తి వేయాలి. లఖింపూర్ బేరి హత్యాకాండ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆ పోరాటంలో వీరమరణం పొందిన రైతు అమరుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలి అని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అమనగoటి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జంగయ్య, సీఐటీయూ నాయకులు యాదగిరి, సి హెచ్ నరసింహ, జంగయ్య, షేప్పివున్నిసా, యాదయ్య వీరేశం, జగన్ చరణ్, తరుణ్, శ్రీకాంత్. తదితరులు పాల్గొనడం జరిగింది.