పోడు భూముల్లో సేద్యం చేసుకునే వారికే హక్కు పత్రాలు

Published: Tuesday December 13, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 12 డిసెంబర్ ప్రజా పాలన : పోడు భూముల్లో సేద్యం చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న రైతులు హక్కు పత్రాలు పొందేందుకు అర్హులని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ఓఎఫ్ఆర్-2005 చట్టం ప్రకారం అర్హులైన వారికి పోడు భూముల కేటాయింపులపై  జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ సభల ద్వారా పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న వారి వివరాలను సేకరించడం జరిగిందని, అర్హత మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఏదేని కారణాల చేత దరఖాస్తులు తిరస్కరించినట్లయితే సబ్ డివిజన్ లెవెల్ కమిటీ తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను తిరిగి పరిశీలించబడతాయని ఆమె తెలిపారు.  ప్రతి ఒక దరఖాస్తును పరిశీలించి పారదర్శకంగా, ఉదారంగా, నిబంధనల మేరకు  పోడు భూముల హక్కు పత్రాలు పొందే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు.  అటవీ ప్రాంతం సరిహద్దు బయట ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకోబడవని ఆమె అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లారెవెన్యూ అధికారి అశోక్ కుమార్,  జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, కమిటీ సభ్యులు ధారూర్,  కుల్కచర్ల జడ్పిటిసి, పెద్దముల్, బొమ్మ రాస్ పేట్ జెడ్పిటీసి సభ్యులు  సుజాత , రాందాస్ నాయక్, మంజుల,  అరుణాదేశ్ ముఖ్, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.