బీసీలకు చట్టసభలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి

Published: Thursday December 15, 2022
జన్నారం, డిసెంబర్ 14, ప్రజాపాలన: బీసీలకు చట్టసభలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘం ఉధ్యామ పోరాట సమితి మంచిర్యాల జిల్లా కో- కన్వీనర్ దండవేణి చంద్రమౌళి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని మాట్లాడుతూ పార్లమెంటులో బీసీల రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర అన్ని పార్టీల అధ్యక్షులకు మెమొరడం ఇవ్వాలని, వినతి పత్రం ఇచ్చిన అనంతరం పార్టీల అధ్యక్షులు  పోరాటం చేసి, బీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ, వాడి ద్వారా బీసీలకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జన గణనలో బీసీ కులాల వారిగా జన గణన చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని బీసీ నాయకులు తీర్మానించేసిన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉండి చట్టసభలో రిజర్వేషన్ల కోసం నడుం బిగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ సంఘం కో కన్వీనర్ కోడూరు చంద్రయ్య, కొంతం శంకరయ్య, కాసెట్టి లక్ష్మణ్, సాంబారి అంజయ్య, చేట్టిపెల్లి గంగయ్య, మామిడి విజయ్, సిరవేణి పెద్దిరాజం,  శ్రీరాముల గంగాధర్, వేయికండ్ల రవి, కాడార్ల నర్సయ్య  శ్రీపాద రమేష్, ఆడెపు లక్ష్మీనారాయణ, ముదెళ్ల శంకర్, దండవేణి శ్రీధర్, నాగుల రాజన్న, బుర్ర గడ్డ జగన్, తదితరులు పాల్గొన్నారు.