టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి లేనిచో కార్యాలయాలను ముట్టడి చేస్తాం --బి.సి సంక్షేమ సంఘం డిమాండ

Published: Saturday January 07, 2023

జగిత్యాల, జనవరి 06 (ప్రజాపాలన ప్రతినిధి):  ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయాలని బి.సి సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 44 వేల టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 12 వేల పోస్టులు, ఎయిడెడ్ పాఠశాలల్లో 4900 టీచర్ల పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో 2000 టీచర్ల పోస్టులు, కస్తూర్బా పాఠశాలలో 1200 టీచర్ల పోస్టులు, ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఇవి కాక ప్రభుత్వ పాఠశాలల్లో 4000 కంప్యూటర్ టీచర్ల పోస్టులు, 10,000 పి.ఈ.టి టీచర్ల పోస్టులు, 5000 ఆర్ట్ & క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ల పోస్టులు 3000 లైబ్రేరియన్ టీచర్ల పోస్టులు, 4000 జూనియర్ అసిస్టెంట్ టీచర్ల పోస్టులు, 10000 అటెండర్ల పోస్టులు, ఖాళీగా ఉన్నవి అన్నారు. ఇంత పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీగా ఉంటే  భర్తీలు చేయకుండా ఇటు విద్యార్థుల భవిష్యత్తుతో పాటు అటు నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని బి.సి సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేస్తున్నదని అన్నారు. విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడకుండా వెంటనే టీచర్లను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో విద్యార్థులతో పెద్ద ఎత్తున విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో బి.సి సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎలగొండ రాధాకిషన్, బి.సి జాగృతి సంస్థ జిల్లా ఇంచార్జ్ సీపతి రమేష్, బి.సి సంక్షేమ సంఘం జగిత్యాల పట్టణ అధ్యక్షులు తిరుపురం రాంచందర్, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనుమల్ల సంజయ్ సామ్రాట్, జిల్లా యువజన సంఘం కార్యదర్శి సిరిపురం శ్రావణ్ కుమార్, బి.సి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుంటి గంగారాం, మరియు బి.సి నాయకులు తిరుపురం శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.