ఆళ్ళ పాడు గ్రామంలో ఇంటింటి సర్వే కార్యక్రమం

Published: Wednesday August 25, 2021
బోనకల్లు, ఆగష్టు 24, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం లోని ఆళ్ల పాడు గ్రామంలో వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి కారణంగా గ్రామంలో ఆశా వర్కర్లు అంగన్వాడీలు సంయుక్తంగా ఏర్పడి గ్రామంలోని ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలో జ్వరంతో ఉన్న వారు ఎంతమంది ఉన్నారు అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సర్వే నిర్వహించడం వల్ల గ్రామాల్లోని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సర్వే చేయడం జరిగింది ప్రతి రోజు జరిగే డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ప్రజలందరికీ ఎంతో ఉపయోగం అని అన్నారు ఎటువంటి జ్వరాలు ఉండకూడదని ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ జ్వరాలతో ఉన్నవారికి మందులు పంపిణీ చేయడం జరిగింది గ్రామంలోని ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రజలు కూడా పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కళావతి, రత్నకుమారి అంగన్వాడీ టీచర్లు పద్మ, గౌరమ్మ, హుస్సేన్ బి తదితరులు పాల్గొన్నారు.