రేపు సినీనటుడు సుమన్ అన్నారుగూడెం రాక

Published: Saturday December 03, 2022
తల్లాడ, డిసెంబర్ 2 (ప్రజా పాలన న్యూస్):
ఈ నెల 4వ తేదిన తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి ప్రముఖ సినీహీరో సుమన్ రానున్నట్లు దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు గుమ్మా నరేష్ తెలిపారు.  అన్నారుగూడెం హైస్కూల్ అవరణంలో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు - దాసరి పద్మ దంపతుల స్మారకార్ధం నిర్మించిన కళావేదికను సుమన్ ప్రారంభిస్తారని వెల్లడించారు. 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య,
విశిష్ట అతిధిగా ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహరావు హజరు కానున్నారని,  ప్రజలు అధిక సంఖ్యలో హజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.