స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో యువతీ యువకులకు ఉచిత శిక్షణ

Published: Thursday September 23, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం, 22 పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతి తో పాటు ఉద్యోగం కల్పించబదుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహేష్ బాబు తెలిపారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన - భారత ప్రభుత్వం ద్వార నిర్వహింపబడే ఉపాధి అధారిత సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు అర్హత మరియు ఆసక్తి గల గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది. ఆటోమొబైల్ - 2 మరియు 3 వీలర్ సర్వీసింగ్  కాలపరిమితి 4 నెలలు పదవ తరగతి పాస్ తప్పనిసరి. ఎలక్షీషియన్ (డొమెస్టిక్ మరియు సోలార్ సిస్టమ్ ఇన్స్టిలేషన్ మరియు సర్వీస్ కాలపరిమితి ఆరు నెలలు ఐఐటి పాస్ అయి ఉండాలి. ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్) కాలపరిమితి 4 నెలలు పదవ తరగతి పాస్, ఎకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ) కాలపరిమితి 3 నెలలు బీకాం పాస్, కంప్యూటర్ హార్డ్ వేర్ అసిస్టెంట్ కాలపరిమితి 4 నెలలు ఇంటర్మీడియట్ పాస్, టైలరింగ్ అసిస్టెంట్ ప్యాషన్ డిజైనర్ కాలపరిమితి 4 నెలలు పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్, అయి ఉండాలి   ఇతర అర్హతలు : వయస్సు 18-30 సంవత్సరముల మధ్య ఉండాలి. గ్రామీణ అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు. కావలసిన పత్రాలు : అర్హతగల ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సెట్లు, పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎంపిక కాబడిన అభ్యర్థులు 250 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ చెల్లించవలెనని తెలిపారు. చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, అలాటిపూర్ గ్రామం, పోచంపల్లి (మం) యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ - 508 284. హైదరాబాద్, దిల్‌సుఖ్ నగర్ నుండి 524 సంబర్ బస్ సౌకర్యం కలదు. స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయని చివరి తేది- 25.09.2021 (శనివారం) ఇతర వివరాలకు 9133908000 , 9133908111, 9133908222, 9948466111 తెలియజేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహేష్ బాబు తెలియజేశారు.