శ్రీనిధి ఎడ్యుకేషన్ కు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు

Published: Wednesday February 01, 2023

 ప్రజా పలన- శేరిలింగంపల్లి/ జనవరి 31 న్యూస్

 
 
 విద్యా విధానంలో నూతన ఒరవడితో దూసుకుపోతున్న
సాయిరాం, శ్రీనిధీ ఎడ్యుకేషన్ సొసైటీకి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ నల్లపాటి
 వెంకటేశ్వరరావు మరియు నల్లపాటి రాజేశ్వరీ లు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక్క రోజులో 17,789 ఫ్లాగ్ సీడ్స్ ను పంచారు. ఆత్యధికంగా సాగ్సేడ్స్ ను శ్రద్ధలో పంచడంద్వారా జెండా యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని విద్యార్థులకే కాక ప్రతి ఒక్కరికీ తెలయజేశారు. ఇంత శ్రద్ధ కనబరిచిన చైర్మన్ సార్ నల్లపాటి వెంకటేశ్వర రావు మరియు నల్లపాటి రాజేశ్వరి లకు అరుదైన అవార్డు, ఇంటర్ నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించినట్లు వారు తెలిపారు.ఇది విద్యా ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎంతో గర్వకారణం. మరెంతో ఆనందకరమైనక్షణం. ఈ అవార్డ్ రావడానికి కృషి చేసిన ప్రతిఒక్కరికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. విద్య ఎడ్యుకేషనల్ సొసైటీ కి అవార్డు రావడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నామని కొండాపూర్, శ్రీనిధి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రిన్సిపాల్ భావన అన్నారు,