డీవార్మింగ్ ను విజయవంతం చేయాలి.. తల్లాడ వైద్యాధికారి డాక్టర్ నవ్యకాంత్..

Published: Thursday September 15, 2022
తల్లాడ, సెప్టెంబర్ 14 (ప్రజా పాలన న్యూస్): మండలంలో నేడు జరిగే నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తల్లాడ ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ నవ్య కాంత్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఏడాది వయస్సు నుండి  19ఏళ్ళ పిల్లలకు ఆల్బెండజోలు మాత్రలు వేయనున్నట్లు  తెలిపారు. ఒక సంవత్సరం వయస్సు నుండి 2 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లకు 1/2 మాత్ర,  2 సంవత్సరాలవయస్సు నుండి 19 సంవత్సరాల వయస్సు వున్న పిల్లలకు ఒక మాత్ర వేయనున్నట్లు వెల్లడించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేట్, అంగన్వాడీ పాఠశాలల్లో మాత్రలు వేస్తామని తెలిపారు.