భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం.

Published: Monday September 26, 2022
ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో గ్రామ పంచాయతీల నుండి ముఖ్య కార్యకర్తలు హాజరైనారు.
 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి పినపాక నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదే కేశవరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ దేనని రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర సందర్భంగా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ప్రజలంతా స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్న సందర్భంగా కార్యకర్తలు అందరూ మరింత ఉత్సాహంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో పద్ధతిలేని పాలన సాగుతుందని దళిత బంధు గిరిజన బందు పోడు భూములకు పట్టాలు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని  చేల్లని జీవో లతో గిరిజనులను  ఎంత కాలం మభ్యపెడతారని అన్నారు ఎనిమిది సంవత్సరాల్లో ఒక్క ఎకరానికి కూడా పోడు భూములకు పట్టాలివ్వని ఈ ప్రభుత్వం గిరిజనుల దగ్గర నుండి భూములు గుంజుకుని మొక్కలు  వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తానంటే ఎలా నమ్ముతారు గిరిజనులు దళితులు పేదవారు అన్ని వర్గాల వారికి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని గాదే కేశవ రెడ్డి అన్నారు మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య మాట్లాడుతూ మేం పార్టీ మారతామని వస్తున్న  వదంతులను నమ్మొద్దని నా జీవితం ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని అందరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం కష్టపడదామని అన్నారు ఈ కార్యక్రమంలో అశ్వాపురం పిఎసిఎస్ ఉపాధ్యక్షులు  గాదే వెంకటరెడ్డి ఎంపీటీసీ బేతం రామకృష్ణ సర్పంచ్ బట్ట సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు కొండబత్తుల ఉపేందర్ తూము వీర రాఘవులు కాక రాములు మచ్చా నరసింహారావు బచ్చు వెంకటరమణ  ఎస్ డి జానీ  సాహిద్ దుగ్గంపూడి జ్యోతి మానాది సైదులు చెంచల రాము గుర్రం చెన్నయ్య కందుల లక్ష్మణ్ పాములు అన్ని పంచాయతీల నుండి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
 
 
 
Attachments area