డ్రోన్ పురుగు మందుల పిచికారీ యంత్రాన్ని ఆవిష్కరించిన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Friday April 09, 2021
జగిత్యాల, ఏప్రిల్ 08 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల రూరల్ మండల్ తక్కలపెల్లి గ్రామంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో (డ్రోన్)తో పురుగు మందుల పిచికారీ యంత్రాన్ని జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయంను ఒక పండగలాగ మార్చిన ఘనత కేసీఆర్ అని అన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఉపయోగొంచుకొని డ్రోన్ల ద్వారా చాలా తక్కువ సమయంలో పంట పొలాలపై మందులను పిచికారీ చేయడం వలన సమయం ఆదా అవుతుందని వ్యవసాయశాఖ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసి జగిత్యాల పేరును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేల చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగారాం గౌడ్  సర్పంచ్ జైపాల్ రెడ్డి ఎంపీటీసీ సురేందర్ రెడ్డి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడిఆర్ జగన్మోహన్ రెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాక సురేష్ కుమార్ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకట్ రావు ప్యాక్స్ చైర్మన్ సందీప్ రావు మండల రైతు బంధు సమితి సభ్యులు రవీందర్ రెడ్డి డైరెక్టర్ రమణ ఆత్మ చైర్మన్ రైతులు నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.