ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి. *రైతు వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ కలెక్ట

Published: Tuesday December 06, 2022
టీపీసీసీ అధ్యక్షులు  ఏనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు,  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని 4 మండలాలు, 4 మున్సిపాలిటీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, యువజన నాయకులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై, రైతుల సమస్యల పరిష్కారానికై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన ధర్నా లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి కొండ్రు పుష్పలత, మాజి ఎమ్మెల్యే కోదండ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్ రెడ్డి రంగారెడ్డి, టిపిసిసి సభ్యులు  మర్రి నిరంజన్ రెడ్డి, దండెం రాంరెడ్డి  పాల్గొని రైతాంగ సమస్యలు, పోడు భూములు, ధరణి పోర్టల్ తదితర విషయాలపై ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపై మండిపడ్డారు. అదేవిదంగా పోడు భూముల బాధితులు, ధరణి పోర్టల్ బాధితులు, రుణమాఫీ జరగని రైతులు, రైతు భీమా, రైతు బంధు బాధితులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రైతు సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అందుకే రైతుల కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో రైతులు అరిగొస పడుతున్నారు. పంట పండించేందుకు పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు, అప్పుచేసి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదు, రుణాలు లేవు, రుణ మాఫీ  చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా నిరుపేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, రైతులకు భూమిపై హక్కు అనేది లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కెసిఆర్ ప్రభుత్వం పోడు రైతుల భూములు దౌర్జన్యంగా లాక్కొని హింసిస్తున్నారని ఆరోపించారు . తక్షణమే రైతులుఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
2023 లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె రైతు రాజ్యం వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తాం, ఏకకాలంలో 2 లక్షల రుణ మాఫీ చేస్తాం, పోడు రైతులకు అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి , డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి , సీనియర్ నాయకులు ఈసీ శేకర్ గౌడ్, కొత్త కురుమ శివకుమార్ జెడ్ పి టి సి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి, శంకర్, మల్లేష్, చేతల్ల సంజీవ,  స్టేట్ కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గుండ్ల వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కళ్లెం శ్రీధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ దేసారం జగన్ మోహన్ గౌడ్, యూత్ కాంగ్రెస్ సౌండ్ శ్రీను, వార్డు మెంబర్ రాహుల్ కాంటేకర్, ఉషియరి మధు, రాంబాబు, హతిరామ్, నర్సింహ్మ, అక్షయ్ రెడ్డి, శ్రీకాంత్, అఖిల్, సీనియర్ నాయకులు, కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, ఈర్లపల్లి వెంకటరెడ్డి, మహిళ అధ్యక్షురాళ్ళు, మహిళ కార్యకర్తలు, యువజన నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, రైతులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.