భౌతిక దూరం లేదు ! జరిమానాలు లేవ్

Published: Thursday May 06, 2021
పరిగి 5 మే ప్రజాపాలన ప్రతినిధి : ప్రాణాంతక మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో ప్రతిరోజు కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వం ఏ నిబంధన పెట్టినప్పటికీ  వాటిని పెడచెవిన పెట్టి సంచరిస్తున్న జనం మహామారి వలలో చిక్కుకుంటున్నారు. కరోనా నిర్మించటంలో సామాజిక దూరం మాస్కు ధరించాలని ప్రభుత్వ చెప్తున ప్రజలు మాత్రం పేరుకు మాత్రమే మాస్కులు ధరించి దవడ కింది భాగాన పెట్టుకొని  గుంపులు గుంపులుగా సంచరిస్తున్నారు. మొదటి దశ కరోనా  కంటే రెండో దశ  కరోనా తో  ప్రజలు మృత్యువాత పడుతున్నారు. సామాన్యుడు కరోనాతో ఆసుపత్రికి వెళితే ఇంటికి తిరిగి వస్తాడో లేదో అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. జీవో  68 ప్రకారం భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు ధరించాలని చెప్తున్నా ప్రజలు మాత్రం పక్కన పెట్టి గుంపులు గుంపులుగా దుకాణాలలో బట్టల షాప్ లలో  కనిపిస్తున్నారు. ఇవి కంటికి కనిపిస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అన్నే అనుమానాల వినిపిస్తున్నాయి. అయితే వీటి పై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోక పోవడమే కారణం అని పలువురు విమర్శిస్తున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి దుకాణాలలో బట్టల షాపులలో హోటల్స్ లో కరోనా నిబంధనలు పాటించెలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.