గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ముఠా అరెస్ట్.

Published: Wednesday June 02, 2021

బెల్లంపల్లి జూన్ 1 ప్రజా పాలన ప్రతినిధి : క్షుద్ర పూజలు చేస్తూ గుప్త నిధులు బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు రామగుండం టాస్క్ ఫోర్స్ సి ఐ ఎకే మహేందర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్తనిధుల తవ్వకాలు జరుపుతున్నారని పక్కా సమాచారంతో తాళ్ల రెబ్బెన గ్రామ శివారు లోని నెన్నేల కన్నెపల్లి రహదారిలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను తనిఖీ చేయగా గుప్తనిధుల కోసం సంచరిస్తున్న కొప్పర్తి ప్రశాంత్, రేగుంట నారాయణ, మహేష్, కోడి తిరుపతి, అనే నలుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు, మరో నిందితుడు బెల్లంపల్లి మున్సిపాలిటీ లో పనిచేస్తున్న మల్లేష్ రారీలో ఉన్నాడని వారిని విచారించగా ఆసిఫాబాద్ జిల్లా దయగాం మండలంలోని కొంచె వెళ్లి మహేష్ అనే వ్యక్తి ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడానికి వెళ్తున్నట్టు చెప్పడం జరిగిందని గత కొంత కాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపి నట్టు వారు చెప్పారని , వారి సెల్ ఫోన్ లోని ఫోటోలు వీడియోల సమాచారం ఆధారంగా కన్నే పెళ్లి మండలం వెంకటాపూర్ అటవీ ప్రాంతంలో కూడా తవ్వకాలు జరిపినట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆ నలుగురు నిందితులను వారి వద్ద నుండి స్వాధీనపరుచుకున్న పూజా సామాగ్రి నిమ్మకాయలు సెల్ ఫోన్లు ఆటోను తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు, ఈ దాడిలో రామగుండం టాస్క్ ఫోర్స్ సి ఐ మహేందర్, ఎస్సై లచ్చన్న, టాస్క్ఫోర్స్ సిబ్బంది సంపత్కుమార్, శ్యాంసుందర్, సదానందం గౌడ్, వెంకటేష్, శ్రీనివాస్, భాస్కర్ గౌడ్, రాకేష్, ఓంకార్, పాల్గొన్నారని ఆయన తెలిపారు.