వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తాసిల్దార్ కు విన

Published: Wednesday December 08, 2021
బోనకల్, డిసెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి: వరి ధాన్యం దిగుబడి వస్తున్న సమయంలో వరి రైతులకు ఇబ్బంది కలగకుండా మండలంలోని పది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సిపిఐ, సిపిఎం పార్టీలు బోనకల్లు మండలం తాసిల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు మాట్లాడుతూ బోనకల్ మండలంలో 70 శాతం మంది రైతులు వరిని పండిస్తున్నారని, గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంతో పాటు తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. గత సంవత్సరం నవంబర్ నాటికే ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు అదృష్టవశాత్తు మన మండలంలో ఒక నెల రోజుల పాటు దిగుబడి ఆలస్యమైందని, ఈ నెల రెండవ వారంలో పంట దిగుబడి ప్రారంభమవుతుందని, అధికారులు వెంటనే మేల్కొని ముందస్తు ప్రణాళికలతో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు .ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఐ బోనకల్ మండల కార్యదర్శి యం గల ఆనందరావు, జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, సిపిఎం మండల నాయకులు ఏడు నూతల లక్ష్మణరావు, చెన్నా లక్షాద్రి, బిళ్ళ విశ్వనాథం, సీపీఐ నాయకులు సాధనపల్లి అమర్ నాధ్ , సిఐటియు మండల నాయకులు బోయినపల్లి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.