హమాలీ వాడ - తిలక నగర్ రోడ్ పనులు వెంటనే ప్రారంభించాలి* - బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ డిమ

Published: Thursday August 04, 2022

మంచిర్యాల టౌన్, ఆగష్టు 03, ప్రజాపాలన: హమాలీ వాడ - తిలక నగర్ రోడ్ పనులు వెంటనే ప్రారంభించాలి.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ హమాలీ వాడ - తిలక నగర్ 60 రోడ్డు నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న ఇండ్లను, డ్రైనేజీలు తొలగించి మూడు నెలలు అయిన ఇప్పటి పనుల్లో వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం తో నిర్వాసితులు, వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. రోడ్డు వెడల్పు పేరుతో డ్రైనేజీలను తొలగించడంతో ఇండ్ల నుండి వచ్చే డ్రైనేజీ నీరు ఎక్కడికి అక్కడే ఆగడం తో మురుగు వాసన తో ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు అని అన్నారు. మున్సిపల్ శాఖ వద్ద నిధులు లేకున్నా ఎమ్మెల్యే దివాకర్ రావు, మున్సిపల్ పాలక వర్గం ఏదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇలాంటి అభివృద్ధి పనులను మొదలు పెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మున్సిపాలిటీ లో రోడ్ అభివృద్ధి కొరకు నిధులు లేనప్పుడు రోడ్ వెడల్పు పనులను ఎందుకు మొదలు పెట్టారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా రోడ్డు వెడల్పు పనులు, డ్రైనేజ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో వార్డు ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, బోయిని హరికృష్ణ, ఆకుల సంతోష్, మేన సూరి, ఆనంద్ కృష్ణ, జోగుల శ్రీదేవి, తన్నీరు కృష్ణ, శాణగొండ రాజేందర్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.