రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని తహశీల్దార్ కి వినతి పత్రం

Published: Saturday February 04, 2023

శంకరపట్నం ఫిబ్రవరి 03 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండల తాసిల్దార్ కు శుక్రవారం జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని వినతి పత్రాన్ని సమర్పించారు .ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం గొల్ల కురుమల సంక్షేమం కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో రెండు సంవత్సరాల్లోనే అందరికీ గొర్రెల పంపిణీ చేస్తామని మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసిందని, ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు రెండో విడతను పూర్తి చేయలేదన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే మొదలు పెట్టి లబ్దిదారుల అకౌంట్ లో నేరుగా నగదు బదిలీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాదవశాత్తు గొర్రెల కాపరి మరణిస్తే పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొర్రెల మేతకు ఇబ్బందులు ఎదురవుతున్నందున ప్రభుత్వ భూమిని గొర్ల కాపరుల సొసైటీ లకు అప్పగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల కొమరయ్య, కన్నెవేణి తిరుపతి, మారవేణి రాజయ్య, కేశవేణి రవిందర్, కుర్ర అయిలు కొమురయ్య, భూస అయిలయ్య, గుండవేణి అయిలయ్య,  తదితరులు పాల్గొన్నారు.