బెల్లంపల్లిలో ఘనంగా మద్దికాయల ఓంకార్ 13వ వర్ధంతి

Published: Monday October 18, 2021
ఎం సిపిఐ (యు) జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ
బెల్లంపల్లి అక్టోబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : దోపిడి పాలన అంతం కొరకు, కష్ట జీవుల రాజ్యం కొరకు కడదాకా నిస్వార్ధంగా పనిచేసిన నేత అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్, అని ఆయన ఆశయబాటలో పయనిద్దామని మంచిర్యాల జిల్లా ఎం సిపిఐ జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 13వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వ్యవస్థాపకులైన ప్రముఖుల్లో ఒకరైన  అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ఒకరని దోపిడీ లేని రాపిడి లేని నవ సమాజ నిర్మాణం కోసం, సమసమాజ స్థాపన కోసం, జనతా ప్రజాస్వామిక విప్లవం కోసం, ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరవేయడం కోసం అహోరాత్రులు అలుపెరుగని ఎన్నో ప్రజాఉద్యమాలు చేస్తూ, ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తిస్తూ కమ్యూనిస్టుల ఐక్యతను, ఆకాంక్షిస్తూ నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచి సొంత ఆస్తులు కూడబెట్టని,స్వార్థమెరుగని నిస్వార్ధ ప్రజాసేవకుడని అన్నారు, విప్లవాలఖిల్లా నల్లగొండ జిల్లాలో జన్మించి రాష్ట్ర పిలుపులో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకొని దొరలకు, భూస్వాములకు, గూండాలకు సింహ స్వప్నమై నిలిచి, ప్రజల ఆదరాభిమానాలు చూరగొని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎర్రజెండే ప్రజలకు అండని, ఏనాటికైనా ఈ దేశానికి పట్టిన జబ్బుకు ఎర్ర జెండానే మందని తెలిపిన తెలిపిన నాయకుడని, ఎర్రజెండే దిక్కని, ఈ బూర్జువా పార్టీలకు, పాలకులకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని, ఓంకార్ గారి ఆశయబాటలో పయనించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్బని కృష్ణ, రాజేంద్రప్రసాద్, వంశీ, ఆకాష్, బండి మల్లేష్, విజయలక్ష్మి, తార, రాజసులో చన, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.