దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్

Published: Thursday February 16, 2023
: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 15 ఫిబ్రవరి ప్రజాపాలన : దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అని  వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని, వికారాబాద్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన  కార్యక్రమంలో పాల్గొన్నారు. అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం సామాజిక సంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం, సేవాలాల్ మహారాజ్ ఎంత కృషి చేశారని, వారు అనుసరించిన విధానాలు వారి స్ఫూర్తి అడవి జాతులకు రక్షణ కవచంలా నిలిచాయన్నారు, ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. గిరిజనుల క్షేమానికి కృషి చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ... గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ,  ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గిరిజన సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.