శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు

Published: Thursday March 09, 2023
మధిర ,మార్చి 8 ప్రజా పాలన ప్రతినిధి:
బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు మహిళా టీచర్స్ కు ఘనంగా స్వాగతం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ ఉమెన్స్ డే అనే ఆకృతిలో కూర్చుని మహిళా టీచర్లను స్వాగతించిన తర్వాత మహిళా టీచర్లకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి స్కూలు కరస్పాండెంట్ బి. అంజన్ బాబు, మరియు ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు మరియు డైరెక్టర్ చందు, వెంకటనారాయణ ఆధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.