గడపగడపకు వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమం.. వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ రామ్ నాయక్..

Published: Monday January 23, 2023
 వైరా, జనవరి 21 (ప్రజాపాలన న్యూస్): వైరా నియోజకవర్గ వ్యాప్తంగా గడపగడపకు వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ ధర్మ శోత్ రామ్ నాయక్ అన్నారు. శనివారం 
 వైరా నియోజకవర్గ కొనిజర్ల మండల దిద్దుపుడి గ్రామంలో గడపగడప కార్యక్రమంలో ధ రామ్ నాయక్  ఆధ్వర్యంలో నూతన కమిటీలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయడమే మన ధ్యేయమన్నారు.  ఈ కార్యక్రమంలో కోట్ల వెంకటేశ్వరరావు, చెరుకుమల్ల రాంబాబు, పోట్ల  అచ్యుతారావు, కోట సీతారామయ్య, పోట్ల సమత, వైర మండల ప్రధాన కార్యదర్శి మారుతి సతీష్ శర్మ, కొంజర్ల మండల అధ్యక్షులు జకరయ్య, అంజి, సూర్యం తదితరులు పాల్గొన్నారు.