మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరాలి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర

Published: Wednesday October 26, 2022
అక్టోబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు స్థానిక మార్కెట్ యార్డ్ లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియా ఇన్ఛార్జిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూనా పుట్టినరోజు వేడుకలను రాజకీయ వేడుకలుగా మల్చిన నాయకులకు, సోషల్ మీడియా ఇన్చార్జిలకు, కార్యకర్తలందరూ ధన్యవాదాలుజిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు జన్మదిన వేడుకలు మధిర వాడవాడలో ఘనంగా నిర్వహించారు. మొదటిగా మండల పరిధిలోని ఆత్కూరు గ్రామoలో అబ్బూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును కట్ చేసి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి వార్డ్ కౌన్సిలర్ మాధురి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటుచేసిన కేక్ కట్ చేసిన అనంతరం మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన సభలో పాల్గొని కేక్ కట్  చేశారు. ఈ సందర్భంగా లింగాల కమల రాజు మాట్లాడుతూ తన యొక్క పుట్టినరోజును రాజకీయ ప్రచార వేదికగా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరాలని రాబోయే కాలంలో మధిర ఎమ్మెల్యేగా గెలుపు పొందె వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని,  ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలే ప్రజల అభిమానాన్ని పొందుతున్నాయని వారి సందర్భంగా అన్నారు.కమల్ రాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని బల ప్రదర్శన చేసిన టిఆర్ఎస్ శ్రేణులుఎన్నికల నామినేషన్ కార్యక్రమాన్ని తలపించిన ర్యాలీఆత్కూర్ నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో వచ్చిన లింగాల కమల్ రాజ్*
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పది నెలల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో జడ్పీ చైర్మన్ టిఆర్ఎస్ మధిర నియోజకవర్గం ఇంచార్జి లింగాల కమల్ రాజ్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించి ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల చింతకాని మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రానున్న ఎన్నికల్లో లింగాల కమల్ రాజును గెలిపించాలని కోరడంతో మరోసారి కమల్ రాజు మధిర నియోజకవర్గ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని కార్యకర్తలకు తెలిసిపోయింది. లింగాల కమల్ రాజ్ నియోజకవర్గంలో ఆపరేషన్ ఆకర్ష ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సర్పంచులను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. రాష్ట్రంలో మరోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో మధిరలో కూడా టిఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు ఇప్పటినుండే కమల్ రాజ్  ముందుకు  సాగుతున్నారు. దీనిలో భాగంగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కమల్ రాజు జన్మదినాన్ని ఉపయోగించుకున్నట్లు రాజకీయ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు అనంతరం ప్రముఖులు రాజకీయ నాయకులు వార్డు కౌన్సిలర్లు చైర్మన్ మొండితోక లత జయకర్ మల్లాది వాసు వారి కుటుంబ సభ్యులు వాకర్స్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం.
 జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  పుట్టినరోజు సందర్భంగా  మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి కార్యక్రమంలో బాలు కాంపల్లి రచించిన కమల్ రాజ గీతాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మధిర రెస్క్యూ టీం ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మైలా నిస్సి హరిణి  ప్రముఖ గాయని కుమారి రమణ మండలాల సోషల్ మీడియా ఇన్చార్జిలు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రావూరి శ్రీనివాస్ వెంకటేశ్వర రావు కోటేశ్వరావు కృష్ణ ప్రసాద్ వేణు నరేందర్ రెడ్డి అప్పారావు జవి రెడ్డి ఐదు మండలాల జడ్పిటిసిలు ఎంపీపీలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు