క్వీట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని రగిలిద్దాం !

Published: Friday July 30, 2021
ఇబ్రహీంపట్నం, జూలై 29 ప్రజాపాలన ప్రతినిధి : యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 9-08-2021న ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారత అరక్షణ దినం  పాటిద్దాం అనే  కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రం తో బస్తీలల్లో ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రెటరీ పి అంజయ్య మాట్లాడుతూ. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాల నుండి ప్రభుత్వ రంగ సంస్థలను విచ్చలవిడిగా ప్రవేటీకరిస్తున్నది. కీలక రంగాల్లోకి  విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. బోగ్గు రైల్వే విద్యుత్ విమానాశ్రయాలు ఓడరేవులు స్టీల్  ప్లాంట్లు ఆయిల్ కంపెనీలు మొదలుకొని విద్య వైద్యం చివరికి రక్షణ రంగం దాకా కార్పొరేట్ అధిపతులకు అప్పజెబుతుంది  రెండవసారి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీకి పట్టేపగ్గాలు లేవు  పార్లమెంటులో ఉన్న మంద బలాన్ని ఉపయోగించి అనేక నిరంకుశ  చట్టాలను రూపొందిస్తున్నది అందులో భాగంగానే వ్యవసాయాన్ని సర్వనాశనం చే ఆహార భద్రతను దెబ్బతీసే 3 వ్యవసాయ చట్టాలను తెచ్చింది పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నీరుగార్చి  కార్మికులను బానిసత్వంలోకి నెట్టేందుకు తెచ్చినవే 4 లేబర్ కోడలు గ్రామీణ ప్రాంతాల నుండి వలసలను నిరోధించి  కనీసం 100 రోజులు అయినా ఉపాధి గ్యారెంటీ నిచ్చే ఉపాధి హామీ చట్టంలో కులాల విభజన తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నది, చిన్న మధ్యతరగతి మరియు రైతాంగానికి ఎంతో ఉపశమనం ఇస్తున్న ప్రస్తుత విద్యుత్ చట్టానికి సబ్సిడీ ఎగ్గొట్టేందుకు  విద్యుత్ సవరణ చట్టం తెస్తున్నది అలాగే నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రల్ డీజిల్ వంట వ్యాస్  పెరగడంతో ప్రజలమీద తీవ్రమైన భారం పడుతుంది. ఉపాధిలో కులవిభజన రాజ్యాంగ విరుద్ధం ఉపాదిపనిలో పనిచేసిన  కూలీలకు ఇప్పటిమి కూలీ చెల్లించక పోవడం దుర్మార్గం వీటిని వెతిరేకిస్తూ ఆగస్టు 9న జరిగే సేవిండియా కార్యక్రమాన్ని   విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎం జంగయ్య బుగ్గారాములు ఈశ్వరయ్య మల్లేష్ గణేష్ యాదగిరి యాదయ్య వెంకటయ్య నరసింహ తదితరులు పాల్గొన్నారు.