పిఆర్సి కమిషనర్ ఉద్దేశించిన వేతనాలు అందజేయాలి

Published: Wednesday June 23, 2021

సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్
ఆసిఫాబాద్, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వ ఆస్పత్రులలో రెండో ఏఎన్ఎం గా పనిచేస్తున్న వారికి పిఆర్సి కమిషన్ ప్రకటించిన రూ 31 వేల వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్ కార్యాలయం డిఆర్ఓ సురేష్ కు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు లకు వేరువేరుగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పిఆర్సి కమిషన్ సిఫారసు మేరకు  వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులరైజేషన్ చేయాలని, డిమాండ్ చేశారు. జిల్లాలో దాదాపు 1200 మందికి పైగా రెండో యూరోపియన్ ఏఎన్ఎం గా పని చేస్తున్నారన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, 
కరోనా సమయం లో పనిచేస్తున్నప్పటికీ, టిఆర్ఎస్ ప్రభుత్వానికి నీసం సమస్యల పరిష్కారం కోసం కనీసం ఆలోచించడం లేదన్నారు. ఇప్పటికైనా పిఆర్సి వేదిక ప్రకారం రూ 31 వేలు వేతనం ఇవ్వాలని, కరోనా సమయములో పనిచేస్తున్న వారికి ఇన్సెంటివ్ ఇవ్వాలని, కరోనా తో చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కరోనా వచ్చిన ఏఎన్ఎం లకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రతీ సంవత్సరం రెండు జతల యూనిఫాం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఏఎన్ఎంలు పున్న భాయ్, మీనా, శారద, జ్యోతి, భాగ్య, అరుణ, సంగీత సునీత, లీల, పరమేశ్వరి హిమబిందు తదితరులు పాల్గొన్నారు.