ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday December 28, 2022

మేడిపల్లి - తుర్కయంజాల్ వరకు ఫార్మాసిటీ బాధిత రైతుల పాదయత్ర*

* రైతులతో కలిసి మల్ రెడ్డి రంగారెడ్డి రెండు రోజుల పాదయాత్ర
* ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలి
* ఆన్లైన్ పహానీలో రైతుల పేర్లు వెంటనే నమోదు చేయాలి
*బాధిత రైతులకు రైతు బంధు వెంటనే అమలు చేయాలి.
*నిషేధిత జాబితా లిస్టులో నుండి రైతుల భూములను బేషరతుగా తొలగించాలి.

ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం, బుధవారం రెండు రోజుల పాదయాత్రను యాచారం మండలం మేడిపల్లి నుండి తుర్కయంజాల్ రాజస్వ మండల కార్యాలయం (ఆర్డిఓ) వరకు కాంగ్రెస్ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర మంగళవారం ఆగపల్లి వరకు కొనసాగింది. పాదయాత్రలో భాగంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఫార్మసిటీ కి భూములు ఇస్తే
వ్యవసాయపరంగా తీవ్రంగా నష్టపోయి కూలీలుగా మారిపోయి ఆహార ఉత్పత్తి కోల్పోయి తిండి కోసం ఇతరుల వనరులపై ఆధారపడి సొంత ఊరినుంచి వలస వెళ్లి పోవాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు.భూమి కోల్పోని చుట్టు ప్రక్క గ్రామాల్లో, లోతట్టు ప్రాంతాల్లో భూమి మొత్తం కాలుష్య మయమై, పంటల్లో కూడా ఎక్కువగా కెమికల్ చేరడంతో పంటలు కలుషితమవుతాయన్నారు.
పర్యావరణపరంగా
ప్రాణవాయువు (ఆక్సిజన్) కలుషితమై పోయి పరిశ్రమల యొక్క పొగ గొట్టాల నుంచి దట్టమైన రసాయనిక పొగలు కక్కుతూ గాలి కాలుష్యం అయిపోతుంది. ఆ పొగలలో నుంచి చిన్న, చిన్న రసాయనిక వ్యర్థాలు గాలిలో కలిసిపోయి, గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువ అయిపోయి ఊపిరి పీల్చుకోవడానికి అక్కడ ఉన్న మానవాళికి, జీవ, జంతువులకు కష్టమవుతుంది నీరు కాలుష్యం,  భూగర్భజలం కలుషితం అయి ఉన్న కాలువలు, కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు కలుషితమవుతాయన్నారు.తద్వారా అక్కడున్న లోతట్టు ప్రాంతాలు, క్యాచ్మెంట్ ఏరియా, మొత్తం ప్రాంతం అంత కూడా కలుషితమై పోతుంది. దాన్ని మళ్ళీ తిరిగి యథా స్థితికి తీసుకురావడానికి ఏ టెక్నాలజీ వల్ల కూడా సాధ్యపడదు. నేల(మట్టి, మన్ను) కాలుష్యం అవుతుంది.
ఔషధ కంపెనీల డ్రైనేజీ పైపుల ద్వారా బయటికి వచ్చే ప్రమాదకరమైనటువంటి రసాయనిక వ్యర్థాలు డ్రైనేజి మురుగు నీటితో నేల పూర్తిగా కాలుష్యమై పనికిరాకుండా పోతుంది. నల్లటి నీటితో నేల మొత్తము సేద్యానికి పనికిరాకుండా పోతుంది. దుర్గంధం కూడా ఆ మట్టి నుంచి వస్తుంది. తద్వారా నేల సహజ గుణాన్ని కోల్పోయి పనికిరాకుండా సాంఘికమైన ప్రభావాలు, దుష్పరిణామాల వల్ల, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి మొత్తం కోల్పోతాము. ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఎప్పటికి కంపెనీల వాళ్లతో గొడవ పడాల్సి వస్తుంది. కేసులు అంటూ, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి న్యాయం డబ్బు చేతిలో ఉంటుంది. కాబట్టి మనము ఓడిపోవచ్చు. దానివల్ల కుంగి పోవాల్సి వస్తుంది. చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలోని మనుషుల కణాల్లో, జన్యువుల్లో మార్పు జరిగి జన్యు సంబంధమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు పెళ్లిళ్లు కావని ఆయన అన్నారు.
భయంకరమైనటువంటి రసాయన వ్యర్థాల వల్ల గాలి, నీరు, నేల కలుషితమై ఊపిరితిత్తుల జబ్బులు, చర్మవ్యాధులు, మూత్రకోశ వ్యాధులు, మానసికం వ్యాధులు, బిపిలో తేడాలు, క్యాన్సర్ వంటి వ్యాధులతో ఎప్పటికి ఆస్పత్రులు చుట్టూ తిరగాల్సి వస్తుంది.
ఇవి కాకుండా ఇంకా అనేక సమస్యలు ఏర్పడి అందులో నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ పరిశ్రమలు రాకుండా చూడాల్సిన బాధ్యత, కర్తవ్యం మనందరిదని  ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో  బుధవారం తుర్కయంజల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆందోళన నిర్వహించాలని  రైతులకు పిలుపునిచ్చారు.