అభివృద్ధి సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ధ్యేయం కోరుట్ల శాసనసభ్యు

Published: Friday February 03, 2023

కోరుట్ల, ఫిబ్రవరి 02 ( ప్రజాపాలన ప్రతినిధి ):
సీఎం కేసీఆర్‌ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మండలంలోని నాగులపేట, సంగెం,  గుంలాపూర్ గ్రామాలలో అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో  రూ. 45 లక్షలతో గుమ్లాపూర్ లో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, సంగెం గ్రామంలో రూ. 20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు మరియు నాగులపేట గ్రామంలో రూ. 20 లక్షలతో  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కేసీఅర్  నాయకత్వంలో వారి అండదండలతో కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆసరా పెన్షన్ ల ద్వారా వృద్ధులకు ఒంటరి మహిళలకు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయలు, వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు.

958 గురుకుల పాఠశాలలు స్థాపించి నిరుపేద బిడ్డలకు ప్రతి సంవత్సరానికి ఒక విద్యార్థి పై లక్ష ఇరవై వేలు రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోటనారాయణ, జడ్పిటిసి రాజేష్,లావణ్య రైతు సమితి జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు,ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్ నెంబర్స్,  మరియు, బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు  పాల్గొన్నారు.