రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని

Published: Friday April 29, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 28 ప్రజాపాలన ప్రతినిధి : మార్చి 6 తేది వరంగల్ రైతు సంఘర్షణ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహూల్ గాంధీ ఈ సభకు రావడం జరుగుతుంది తెలంగాణా రాష్ట్రo నలుమూలల నుండి తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతు సంఘర్షణ సభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ సందర్భంలో మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ. రాబోయే రోజుల్లో సిఎం గా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీదే విజయకేతనం ఉంటుందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జి మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూమిలేని పేదలకు భూమి పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే రేషన్ కార్డు గురించి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయడం జరిగింది అనేక సమస్యలు ఉద్యమించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బూతులు వారిగా ప్రజలను కదిలించే విధంగా వరంగల్ లో జరిగే సభను జయప్రదం చేయాలని ప్రజలు తెలియజేశారు ఈ సభ రేపు రాబోయే ఎన్నికలు  టిఆర్ఎస్ పార్టీని పతనం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను ఏకతాటిపై నడిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు అదేవిధంగా నియోజకవర్గ ఇన్చార్జిగా భవాని రెడ్డి మాట్లాడుతూ రైతు సంఘర్షణ సభకు మహిళా లోకంని ఈ ప్రచారంలో భాగంగా ముందు బాగా నిలపాలని కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మహిళలకు రక్షణ ఉండేదని ఈరోజు మహిళలపై దాడులు అనేకమైన టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసే విధంగా పూనుకుంటే సహించేది లేదని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే మహిళలను ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుందని ఆమె అన్నారు ఈ సభను మొదలుకొని కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసే విధంగా కార్యకర్తలు సంసిద్ధులై పనిచేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కర్యకర్తల సమావేశం అధ్యక్షులు  జడల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది,. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భవాని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిలుక మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఈసీ శేఖర్ గౌడ్, అర్థిక ప్రవీణ్ గౌడ్, ఆకుల ఆనంద్, కౌన్స్లార్ పంది శంకర్ యాచారం మండల అధ్యక్షులు మస్కు నర్సింహ కున్స్లార్ మోహన్ నాయక్ ఈర్ల పళ్లి వెంకట్ రెడ్డి డైరెక్టర్ పాండు రంగరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్, మండల యువజన నాయకుడు మంకాల కర్ణాకర్, చర్ల పటేల్ గూడా ఎం పి టి సి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు.