ఆరోగ్య మేళ సద్వినియోగం చేసుకోగలరు డాక్టర్ వెంకటేష్ మనోరమ

Published: Wednesday April 20, 2022
మధిర ఏప్రిల్ 19 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ .పరిధిలో  మంగళవారం నాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో డాక్టర్ వెంకటేష్ అధ్యక్షుడు జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, ఖమ్మం వారి ఆహ్వానము,, భారత స్వాతంత్రం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  అజాధి క అమృత మహోత్సవ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా మాటూరు పేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, మధిర హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ మనోరమ  ఆధ్వర్యంలో ఈరోజు మధిర మండల పరిషత్ ఆఫీస్ లో జరిగిన మీడియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, మధిర హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ మనోరమ మాట్లాడుతూ ప్రభుత్వ ఆ దేశముల ప్రకారము మన మధిర, టీవీ ఎన్ ఏంస్కూలు నందు 21. 4 .22 ఉదయం ఎనిమిది గంటల నుంచి 2 గంటల వరకు సూపర్స్పెషాలిటీ వైద్యులతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది.. ఈ శిబిరం లో అన్ని రకాల వైద్య సదుపాయాలు రక్తపరీక్షలు, స్కానింగు, ఎక్స్రే, ఇసిజి మరియు ఇతర పరీక్షలు నిర్వహించి వారికి హెల్త్ ఐడి నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది.. ఈ అవకాశం మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు మండల ప్రజలు వినియోగించుకోగలరు.. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రాజేష్, మండల డెవలప్మెంట్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఇందిరా క్రాంతి పథకం పి ఓ రాంబాబు, మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రావు, ఐసిడిఎస్ సిడిపిఓ శారద, మధిర వైద్యాధికారులు డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ మనోరమ డాక్టర్ శశిధర్ ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు లంక కొండయ్య, భాస్కర్రావు, శరత్ బాబు, సుబ్బలక్ష్మి గోవింద్ పాల్గొన్నారు..