మధిరలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Published: Monday July 25, 2022

మధిర రూరల్ జులై 24 ప్రజా పాలన ప్రతినిధి తెలంగాణరాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్ జన్మదిన వేడుకలు సందర్భంగా ఆదివారం  మధిర పట్టణంలో జడ్పీ చైర్మన్ టిఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జి లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ నాయకులు ముందుగా పట్టణంలో మోటార్ సైకిల్  ర్యాలీ నిర్వహించారు. అనంతరం 10వ వార్డు నందు మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటారు. పదో వార్డులో మల్లాది వాసు ఆధ్వర్యంలో చిత్ర కారులు గీసిన కేటీఆర్ చిత్రపటాన్ని పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నందు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు అక్కడ నుండి ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకొని చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంచారు. అనంతరం టివిఎం హైస్కూల్ ఆవరణలో పార్టీ యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ కూన నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ క్రింద తలసేమియా బాధితులకు అండగా ఉండేందుకు నిర్వహించిన రక్తదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అదేవిధంగా డాక్టర్ వసంతమ్మ మానసిక వికలాంగుల సేవా సదనంలో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత టిఆర్ఎస్ జిల్లా నాయకులు కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత దంపతులు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కనుమూరు వెంకటేశ్వరరావు అరిగే శ్రీనివాసరావు సొసైటీ అధ్యక్షులు బిక్కి కృష్ణ ప్రసాద్ టిఆర్ఎస్ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లూరి హరీష్ బాబు వంకాయలపాటి నాగేశ్వరరావు అబ్బూరి రామన్ ఎర్రగుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు.