కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Published: Tuesday May 04, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం వెల్వర్తి, నాతాళ్లగూడెం, టేకులసోమారం, నేమిలకాల్వ, అరూర్, జంగారెడ్డి పల్లి, సుంకిషాల, రెడ్లరేపాక గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యాలయాలలో సర్పంచుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ పథకం పేదింటి ఆడ పడుచులకు వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పసల అన్నామెరి శౌరి, చేగూరి భిక్షపతి, వంగాల భిక్షపతి గౌడ్, చిట్టెడి జయమ్మ జనార్దన్ రెడ్డి, ఉలిపే మల్లేశం, శివరాత్రి ఎల్లమ్మ, మోగిలిపాక నర్సింహ, అరూర్ పిఏసీఎస్ ఛైర్మెన్ చిట్టెడి వెంకట్ రాంరెడ్డి, ఉపసర్పంచ్ మైసోళ్ల మచ్చగిరి, ఫైళ్ల రాజవర్డన్ రెడ్డి, డేగల పాండు యాదవ్, చెరుకు శివయ్య, రేపాక సందీప్ రెడ్డి వివిధ గ్రామాల ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.