ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

Published: Tuesday March 14, 2023
 మేడిపల్లి, మార్చి 13 (ప్రజాపాలన ప్రతినిధి)
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో 
శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్య అతిధులుగా  

కార్మికశాఖామాత్యులు చామకూర మల్లారెడ్డి, జనగాం ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ పాల్గొని ప్రత్యేేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, మేడ్చల్ గ్రంధాలయం చైర్మన్ దయాకర్ రెడ్డి, బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు కొత్త  చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, చీరాల నరసింహ, సుమన్ నాయక్, కో అప్షన్ సభ్యులు రంగ బ్రహ్మన్న గౌడ్, సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, కొత్త విక్రం గౌడ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.