తపస్ జిల్లా అధ్యక్షునిగా కొత్తగడి అంజిరెడ్డి ఎన్నిక

Published: Thursday October 27, 2022
తపస్ రాష్ట్ర అధ్యక్షుడు కనుగంటి హనుమంతరావు
వికారాబాద్ బ్యూరో 26 అక్టోబర్ ప్రజాపాలన : ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు ఉపాధ్యాయ నియామకాలలో కాలయాపన లేకుండా వెంటనే నిర్వహించాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు కనుగంటి హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వికారాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశానికి తపస్ రాష్ట్ర అధ్యక్షుడు కనుగంటి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తపస్ వికారాబాద్ జిల్లా సంస్థాగత ఎన్నికలు 2022-2025 లను నిర్వహించారు. జిల్లా అధ్యక్షునిగా కొత్తగడి అంజిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఆర్.బహదూర్ లతో పాటు  జిల్లా గౌరవ అధ్యక్షునిగా వెంకటయ్య, కోశాధికారిగా నర్సింలు  లను ఏకగ్రీవంగా ఎన్నుకొనడం జరిగింది. ఈ సంస్థాగత ఎన్నికల అధికారులుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా కార్యవాహ అనంతరెడ్డి, సిద్ధరామేశ్వర్ లు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ జీవో నం.317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిరంతరం ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంఘాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగెం లక్ష్మీకాంతరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూస రాములు, జాక వెంకటేశం, దోమ కమాల్ రెడ్డి, ఆనందం, ఎబిఆర్ఎస్ఎం తెలంగాణ రాష్ట్ర మీడియా కన్వీనర్ కరణం లక్ష్మీ కాంత రావు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ కుమార్ యాదవ్, ప్రసాద్ కుమార్, మల్లేశం స్వామి, జిల్లా కార్యదర్శులు చంద్రమౌళి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కూర గీతా నందిని జిల్లా మహిళా కార్యదర్శి శ్రీలత రెడ్డి జిల్లా సాంస్కృతిక కార్యదర్శి రమాదేవి సీనియర్ సభ్యులు మల్లయ్య, క్రిష్ణా రెడ్డి జిల్లా బాధ్యులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.