రంజాన్ కిట్టూ ముస్లిం సోదరీ, సోదరీమణులకు పంపిణీ

Published: Thursday May 13, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజా పాలన : కెసిఆర్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందజేయడానికి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంతో చొరవ తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ , 30 వ డివిజన్ లాలో తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ గారు మైనార్టీల ముస్లిం సోదరులకు రంజాన్ కిట్టు పంపిణీ చేయడం జరిగింది. మహేశ్వరం నియోజకవర్గం మన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారి ఆదేశాల మేరకు వివిధ డివిజన్లలో ముస్లిం సోదరులకు సోదరీమణులకు రంజాన్ కిట్టు మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్  డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ ప్రేమిల యాదగిరి ముదిరాజ్ వాళ్ల చేతుల మీద బుధవారం నాడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ... కెసిఆర్ ప్రభుత్వం పేదలకు ఎప్పుడు అండగా ఉంటూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు పేదలకు అందజేయడానికి కృషి చేస్తున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి ఎంతో చొరవ తీసుకొని కార్పొరేషన్ అభివృద్ధికి పాటు పడుతున్నారని ప్రజా ప్రతినిధులు కాలనీ వాసులకు తెలియజేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ పవిత్రమైన పండుగ అని చెప్పారు. ఏ రాష్ట్ర  ప్రభుత్వము చెయ్యని సంక్షేమ పథకాల్లో తెలంగాణ ప్రభుత్వానికి సాటిలేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నవీన్ గౌడ్ తో పాటు అక్కడ ఉన్న స్థానిక టిఆర్ఎస్ నాయకులు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.