టి ఏమ్ పి ఈ ఎ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

Published: Saturday July 02, 2022
మంచిర్యాల టౌన్, జూలై 01, ప్రజాపాలన : టి ఏమ్ పి ఈ ఎ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలను శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లాకేంద్రంలో  డా,,బీదాన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా నిర్వహించే
 నేషనల్ డాక్టర్స్ డే ని తెలంగాణ మెడికల్ ప్రైవేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఘనంగా  నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని పలువురు డాక్టర్స్ ని సన్మానించారు  రాష్ట్ర అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వైద్యో  నారాయణ హరి అన్నారు, దేవుడు జన్మణిస్తే వైద్యులు సాధ్యమైనంతవరకు పునర్జన్మ నిస్తారు , తల్లి దండ్రులు గురువుల తర్వాత వైద్యులే కీలకం  అన్నారు,  కరోన సమయంలో రక్త సంబంధికులు  ప్రాణాలకు బయపడి దూరంగా ఉన్న సమయంలో  ప్రాణాలను త్యాగం చేసి అన్ని విధాలుగా వైద్యం చేసి లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు  డాక్టర్స్ అని అన్నారు.  ఈ సంధర్భంగా డా.సుబ్బారాయుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,  డా.రమణ  తన  స్టేట్ ప్రెసిడెంట్,  డా.నీలకంటేశ్వర్ ,  డా. జోగేందర్, డా.భాస్కర్, డా విజయ, డా.ప్రవీణ్ కుమార్,  డా. సింధూజ  లను సన్మానం చేశారు. ఈ  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సొల్లు శ్రీనివాస్  ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాస్ కోశాధికారి రాము తదితరులు పాల్గొన్నారు.