నీలం పద్మ ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ జయంతి వేడుకలు

Published: Friday July 09, 2021
ఆలేరు, జులై 08, ప్రజాపాలన ప్రతినిధి : దివంగత నేత వైయస్ 72వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ. దివంగతనేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని పేదల మఖ్యమంత్రిగా‌ నిలబెట్టింది ఆయన పేదలకు బలహీన వర్గాలకు అమలు చేసిన సంక్షేమ పథకాలే. పాదయాత్రలో ఇచ్చిన హామి ప్రకారంగా రైతులకు ఉచిత విద్యుత్ ఫైలు పైన ముఖ్యమంత్రిగా తొలిసంతకం చేశారు.పేదలకు ఆరోగ్య శ్రీ, విధ్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్, పిలవాగానే కుయ్... కుయ్.. మంటూ వచ్చే 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక సంక్షేమ పథకాలను వైఎస్ ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీలో, ఇందిరమ్మ ఇళ్లు, అప్పటిలో ఉన్న ఫించన్ల మొత్తాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రజల గుండెల్లో ఆయన్ను చిరకాలం గుర్తుండిపోయేలా చేశాయి. యాదాద్రి - భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన వై.యస్.ఆర్ 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయంతి (జులై 8) సందర్భంగా ఆ మహానేత చిత్రపటానికి పూలమాలవేసి అందరు ఘనంగా నివాళులు అర్పించారు.