కూలీల కొరత అధిగమించేందుకు సాంకేతిక పరిజ్ఞానం

Published: Tuesday October 12, 2021
బాలాపూర్: అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : ఆధునిక యంత్ర పరికరాలతోనే సేధ్యంలో లాభం ఉంటుందని, కూలీల కొరత అధిగమించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలిని అందెల అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరం గేట్ వద్ద తిరుమల అగ్రిమార్ట్ నూతన షోరూమ్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ప్రారంభించారు. వ్యవసాయ పనిముట్లు, ఆధునిక సాంకేతిక యంత్ర పరికరాలను పరిశీలించారు. కూలీల కొరతను అధిగమించేందుకు ఈ యంత్రాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని అందెల శ్రీరాములు అన్నారు. వ్యవసాయ యోగ్యమైన కందుకూరు, మహేశ్వరం మండలాలకు అందుబాటులో అగ్రిమార్ట్ నెలకొల్పటం శుభపరిణామనీ అన్నారు. ఈ సందర్భంగా తిరుమల అగ్రిమార్ట్ గ్రూపు ఛైర్మన్ కాసుల మహేందర్ ను అందెల శ్రీరాములు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలు నాగ ప్రమీల, రాష్ట్ర నాయకులు కడారి జంగయ్య యాదవ్, తుక్కుగూడ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు రచ్చ లక్ష్మణ్, కౌన్సెలర్లు, ఫ్లోర్ లీడర్ ఎరుకల శివకుమార్ గౌడ్, జాపాల భావన సుధాకర్, బరిగెల రాజు గౌడ్, రాజమోనీరాజు, శివయ్య, బాకీ విలాస్, అనితా జయరాజు సహా నేదునూర్ మాజీ ఎంపీటీసీ బాలరాజు, తుమ్మలూరు ఎంపీటీసీ రాంరెడ్డి, సిరిగిరిపురం సర్పంచి సురేష్, గుమ్మడవెళ్లి సర్పంచి ప్రభాకర్, ఉపసర్పంచి మహేందర్, తుక్కుగూడ జీఎస్ కృష్ణ, అమీర్ పేట శాలివాహన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, బంటు రమేష్, పాల కృష్ణ, కోటగిరి శ్రీనివాస్, బాదావత్ శ్రీనివాస్, ఆమన్గల్ మాజీ ఎంపీపీ వీరన్న, శ్రీనివాస్ యాదవ్, రఘు, రాజేందర్, ప్రశాంత్ సహా బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.