క్షయ వ్యాది పై అవగాహన కల్గి ఉండాలి: డాక్టర్ పృథ్వి

Published: Wednesday April 05, 2023

 మధిర ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున జిల్లా క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. పృథ్వి, పారా మెడికల్ సిబ్బందిచే ఫీల్డ్ వర్క్ లో భాగంగా ఇల్లూరు మహా దేవపురం ఎస్సి కాలనీ అంబేద్కర్ సెంటర్ నందు ప్రజలకు ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా క్షయ వ్యాది నివారణలో భాగంగా సంపూర్ణ ముగా అవగాహన పరచినారు. అదే విధంగా డా. పృథ్వి పిహెచ్ఎన్ గోలి రమాదేవి మాట్లాడుతూ టీబీ వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం మందులు వాడుచున్న వ్యక్తి ఇంటిలో కుటుంబ సభ్యులకు ఇగ్రా టెస్ట్ అనగా ఆ వ్యక్తి కూటింభికులు పిహెచ్సి కీ వచ్చి ల్యాబ్ టెక్నిషన్ ద్వారా బ్లడ్ శాంపిల్ తీసుకోని తెలంగాణ టీ హాబ్ కు పంపుతారు. దీనిలో ఎవరికైనా టీబీ పొజిటీవి వస్తే వెంటనే ఉచితంగా విలువైన మందులు అందజెస్తారు అని తెలియజేసినారు.అనంతరం గ్రామంలో వృద్దులకు షుగర్ బీపీ పరీక్షలు చేసి తగిన మందులు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ రమాదేవి, హెచ్ఇఒ గోవింద్ పల్లె దవఖానా సిహెచ్ఒ ఐశ్వర్య ,మహా దేవపురం సర్పంచ్ బంగారమ్మ ,ఇల్లూరు సర్పంచ్ కోట రామారావు, హెల్త్ సూపర్ వైజర్ లంకా కొండయ్య, జిపి సెక్రటరీ లు సైదులు సురేష్ జిపి ఐకేపీ అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.