లిటిల్ హార్న్స్ పాటశాలలో సంతూర్ ముగ్గుల పోటీలు

Published: Wednesday January 11, 2023
జన్నారం, జనవరి 10, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని లిటిల్ హాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అక్షిత ఏజేన్సీ వారి ఆధ్వర్యంలో విప్రో సంతూర్ వారి సౌజన్యంతో సంక్రాంతి సంబరాలలో భాగంగా మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగా ఉట్టి పడేలా  వేసిన ముగ్గులు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధాగా -స్థానిక జెడ్పిటిసి ఎర్ర చంద్ర శేఖర్  హాజరై గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఇలాంటి పోటీల వలన మహిళలో ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుందని, ఈ కార్యక్రమ నిర్వహకులకు అభినందనలు తెలియజేసారు. పోటీలలో సుమారు 70 మంది ఉత్సహవంతంగా పాల్గోన్నారు.  మొదటి బహుమతి శృతికి మిక్సీ, రెండవ బహుమతి దివ్య కు కుక్కర్ ,తృతీయ బహుమతి అనిత కు అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ముగ్గుల పోటీలలో  పాల్గోన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్  బహుమతి అందజేసారు. మిగలిన వారికి విప్రో
సాఫ్ట్ టచ్, కిట్టులు చిరు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సంతూర్ డిస్ట్రిబూటర్ రాగి శ్రీధర్, విప్రో SSM షారూఖ్ సయ్యద్, న్యాయ నిర్ణేతలు శ్రీలత, వెంకట్రాజం పాల్గొన్నారు