అయ్యప్ప స్వామి ఆలయంలో నేడే మహా అన్నదానం

Published: Wednesday December 07, 2022
మధిర రూరల్ నవంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో మంగళవారం నాడు  జరిగిన ఉదయాస్తమాన పూజల్లో యన్నం కోటేశ్వరరావు రజిని దంపతులు పాల్గొన్నారు. స్వామివారి 15వ మండల పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అనంతరం అయ్యప్ప స్వామి భక్తులకు, మాలధారులకు వారు యన్నం కోటేశ్వరావు రజిని దంపతులు అన్నదానం వితరణ  చేశారు. ఈ సందర్భంగా యన్నం కోటేశ్వరావు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆయన అన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ అన్నదానాలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలదారులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో యన్నం కోటేశ్వరావు  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మంగళవారం నాడు ఉదయం పూట అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామి అయ్యప్ప దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భాగంగా నడకబజార్ అయ్యప్ప భక్త బృందం దేశభక్తి యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అనేకమార్గా కొబ్బరి మట్టలు మామిడి ఆకు తోరణాలతో ముస్తాబు చేసిన దేశభక్తి యువజన సంఘం అభినందనలు తెలిపిన భక్తులు కార్యక్రమం పాల్గొని శివేలు కార్యక్రమంలో పాల్గొని  మాలదారులకు బిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ 15వ మండలం పూజల భాగంగా బ్రహ్మోత్సవాలు సందర్భంగా మహానదానం భక్తులచే దాతలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు దీనికి అన్ని వర్గాల ప్రజల నుండి స్వామి అయ్యప్ప పూజలో పాల్గొని మహా అన్నదానాన్ని స్వీకరించి స్వామి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి బత్తుల శ్రీనివాసరావు స్వామి చెరుపల్లి శ్రీధర్ స్వామి మైనీడి జగన్మోహన్ రావు స్వామి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు దేవి శెట్టి రంగా, గాంధీ స్వాములు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.