మధిరలో పొంగులేటి అభిమానులు భారీ ర్యాలీ

Published: Thursday October 29, 2020

*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు*
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ*
*అంబేద్కర్ సెంటర్లో కేక్ కటింగ్ చేసిన టిఆర్ఎస్ నాయకులు*

 నియోజకవర్గము కేంద్రమైన మధిరలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం  టిఆర్ఎస్ పార్టీ నాయకులు పొంగులేటి అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబంధు మండల కన్వీనర్ *యన్నం కోటేశ్వర రావు* ఆధ్వర్యంలో  తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి జై టిఆర్ఎస్, జై పొంగులేటి, అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా బయలుదేరారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా దిశా కమిటీ సభ్యులు *డాక్టర్ కోటా రాంబాబు* ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.  అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కేకును టిఆర్ఎస్ జిల్లా నాయకులు *చెరుకూరి నాగార్జున* కట్ చేశారు. వినాయకుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన అన్నదానాన్ని టిఆర్ఎస్ జిల్లా నాయకులు *మొండితోక సుధాకర్*, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు చావలి రామరాజు, కటికల సీతారామిరెడ్డి, ఎన్ఆర్ఐ సైదులు, దోర్నాల మణి బాబు, వేల్పుల బుజ్జి, బండి వెంకటేశ్వర్లు, చల్లా లింగారెడ్డి, కొత్తపల్లి నరసింహారావు, అమరవాది సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.