29వ డివిజన్ లోని ప్రజలకు అండగా నిలిచిన కార్పొరేటర్

Published: Monday May 24, 2021
బాలపూర్, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా కష్టకాలంలో రెక్కాడితే డొక్కాడని కష్టజీవులకు అండగా నిలిచిన స్థానిక కార్పొరేటర్ నీలా రవి నాయక్. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ కార్పొరేటర్ లెనిన్ నగర్ లో గుడిసెల, హుడా కాలనీలో ఉన్న నిరుపేద  200 కుటుంబాలకు నిత్యవసర సరుకులు శనివారం నాడు అందజేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ....... కరోనా విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలిని, అదేవిధంగా ధైర్యంతో ఉండాలని అన్నారు. లాక్ డౌన్ ప్రభావం భాగంగా ఎప్పటిక ప్పుడు అండగా ఉంటూ, నిరుపేద కుటుంబాలకు 5 కిలోల సన్నబియ్యం, పప్పులు, కూరగాయలు మాస్కులు, శానిటైజర్ తదితర వస్తువులను అందజేస్తూ, కరోనా పాజిటివ్ వచ్చిన వారు ధైర్యం కోల్పోకుండా ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియజేయగలరు అని కోరారు. రోజు కూలీ పనిచేసుకునే వారు కావున రెక్కాడితే డొక్కాడని కష్టజీవులకు నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎస్ టి సెల్ గిరిజన మోర్చా అధ్యక్షుడు రమావత్ శ్రీను నాయక్, జిల్లా సెక్రెటరీ అనిత నాయక్ తదితరులు పాల్గొన్నారు.