సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

Published: Tuesday October 11, 2022

మధిర  అక్టోబర్ 10 (ప్రజా పాలన ప్రతినిధి) ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శశిధర్ సూచించారు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున పిహెచ్సి దెందుకూరు పారా మెడికల్ బృందం ఆధ్వర్యంలో మధిర టౌన్లో మధిర వన్ సబ్ సెంటర్ పరిధిలోని యాదవ బజార్ షాదిఖానా ప్రాంగణంలో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ కు మరియు గర్భిణీలకు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా రోజువారిగా షుగర్  బిపి మందులు  వాడే వారికీ వృద్దులకు నెలకు సరిపడా టాబ్లెట్ లు ఇచ్చినారు. ఈ సందర్భంగా డాక్టర్ శశిధర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాదులు గురించి పరిసరాల పారిశుద్యం గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి సంపూర్ణముగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి ఆరోగ్య సిబ్బంది పిహెచ్ఎన్ గోలి రమాదేవి హెచ్ఇఒ  గోవింద్ హెచ్ఎస్ సుబ్బలక్ష్మి మాతా శిశు సంరక్షణ నోడల్ పర్సన్ కౌసెల్య టీబీ ఎయిడ్స్ లెప్రసీ నోడల్ పర్సన్ లంకా కొండయ్య ఎఎన్ఎమ్ లక్ష్మి హెచ్ఎ శ్రీనివాస్ ఆశ కార్యకర్తలు అల్లిక నాగమణి యస్కె అంజూ బేగం యస్కె ముంతాజ్ బేగం ఐసిడిఎస్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.