ఎకో టూరిజం అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి ** జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్

Published: Wednesday November 30, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 29 (ప్రజాపాలన, ప్రతినిధి) :  జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జడ్పీ చైర్ పర్సన్  కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు లు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చింతల మాదర జలపాతం నిర్వహణలో ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి దినేష్ కుమార్ తో కలిసి మంగళవారం నిర్వహణ గ్రామాలలోని 6 గురికి చెక్కు లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జిల్లాలో ఎకో  టూరిజం అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో సహజ వనరులు అనేకం ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు.తిర్యాని మండలంలోని చింతల మాదర జలపాతం నిర్వహణలో రూ 1,90,000 వరకు ఆదాయం వచ్చిందని, వాటిలో ఖర్చులు పోగా మిగిలిన మొత్తం రూ 1,04,000 జలపాతాన్ని నిర్వహించిన గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులకు అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్ ఆయా గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.