కోవిడ్ టీకా ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ అనుమాల తిరుపతి.

Published: Tuesday December 07, 2021
వెల్గటూర్ డిసెంబర్ 06(ప్రజా పాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం ముత్తూనుర్ గ్రామములో కరుణ నివారణలో భాగంగా సోమవారం రోజు రెండవ డోస్ కోవిడ్ టీకా ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అనుమల తిరుపతి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండే విధంగా థర్డ్ ఎదుర్కోడానికి మొదటి విడత వేసుకున్న వారికి రెండోవ డోసును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. గ్రామంలో రెండవ విడత వ్యాక్సినేషన్ 60 శాతం పూర్తి చేశామని త్వరలో వంద శాతం పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన అన్నారు. కరోనా నియమ నిబంధనలు మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ గ్రామంలో చాటింపు కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగామురుగునీటి కాలువలు మురుగునీటి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ నువెదజల్లే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశామని మరియు దోమల నివారణ మందును పిచికారి చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఇందుకు సహకరించిన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోవిడ్ టీకా వేసుకుని సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంబన వెణి ఆంజిత్ కుమార్, సిహెచ్ జగన్నాథం, ఎచ్.ఎస్.పద్మ, ఎచ్.ఎ.ఎం.పద్మ, ఏ.ఎన్.ఎం స్వరూపం, ఆశ వర్కర్లు గవ్వల యమున కొంగ రమా, అంగనివాడిలు పాలకవర్గ సభ్యులు మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.