ఈ నెల 7న మాదిగల స్వాతంత్ర దినోత్సవం

Published: Monday July 05, 2021

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 04 (ప్రజాపాలన): ఈనెల 7న మాదిగల స్వాతంత్ర దినోత్సవం, అదేరోజు మాదిగల ఆరాధ్యదైవం, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మంద కృష్ణ మాదిగ పుట్టిన రోజు కావడం గొప్ప విశేషమని మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్పీ) జిల్లా కోఆర్డినేటర్ రేగుంట మహేష్ ఆదివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ జూలై 7న గ్రామ గ్రామాన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి, కృష్ణన్న పుట్టినరోజు వేడుకలు పండగ వాతావరణాన్ని తలపించేలా, ర్యాలీలతో, సభలతో మాదిగల స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు. మన దేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్రం వచ్చిన మాదిగలకు స్వేచ్ఛా స్వాతంత్రం, ఆత్మ గౌరవం, లేకుండా పోయిందని, రాజ్యాంగబద్ధంగా కులం అనే గౌరవ పదాన్ని కల్పించిన కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గు, బిడియం, మొహమాటం, ఆత్మవంచన ఉండేదన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, అంటూ మనల్ని అంటరాని వారిగా చిత్రీకరించి, ఊరికి దూరంగా పెట్టి, బానిసలుగా చూశారన్నార. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది వ్యవస్థాపక సభ్యులతో మాదిగ దండోరా పేరుతో మొదలైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గా చెంది హక్కులు ఆత్మగౌరవంతో పాటు రాజ్యాధికారం వైపు అడుగులు వేసి ముందుకు పోయా మన్నారు. మన ఐక్యతను సమాజం ముందు చూపించాలంటే మాదిగల స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.