అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్.. చీరలు పంపిణీచేసిన ఎమ్మెల్యే సండ్ర

Published: Saturday September 24, 2022
తల్లాడ, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన న్యూస్) : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం తల్లాడ మండలంలోని బిల్లుపాడు గ్రామంలో ఆయన  బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంను  ప్రారంభించారు. అనంతరం పింఛన్ కార్డులు,కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను   పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జెడ్పిటిసి దిరిశాల ప్రమీల, ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం, తహాసిల్దార్ గంట శ్రీలత, ఎంపీడీవో రవీంద్రారెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రెడ్డే వీరమోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, వైరా ఏఎంసి వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, ఇంజ కృష్ణార్జున రావు, వివిధ మండలాల సర్పంచులు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area