డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

Published: Wednesday April 06, 2022

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 5 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలి మాజీ ఉప ప్రధాని దేశంలో మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన స్వతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ దళితుల కోసం ఎన్నో సేవలు అందించిన మహనీయుడు ఎమ్మెల్యే కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్  సత్తు వెంకటరమణా రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు కార్యదర్శి చిలుకల బుగ్గ రాములు, భాస్కర్ రెడ్డి మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్ రెడ్డి వేణు గోపాల్ రావు, సర్పంచులు కౌన్సిలర్లు యూత్ విభాగం అధ్యక్షులు కార్యదర్శులు టిఆర్ఎస్వి అధ్యక్ష కార్యదర్శులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.