ఘనంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Monday May 24, 2021
వలిగొండ, ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని టేకుల సోమారం గ్రామంలో ఆదివారం భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన సందర్భంగా గ్రామ సర్పంచ్ చేగూరి బిక్షపతి ఆధ్వర్యంలో కరోనా బాధితులకు పండ్లు, కూరగాయలు మరియు గ్రామపంచాయతీ సిబ్బందికి కూరగాయలు, నిత్యవసర సరుకులు, సాధన మానసిక వికలాంగుల ఆశ్రమంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, చేగూరి మల్లేశం పంపిణీ చేశారు. అనంతరం కేక్ కటింగ్ చేసి గ్రామ యువకులకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేకల ప్రభాకర్ గౌడ్, జిల్లెల మల్లారెడ్డి, చేగూరి పరమేష్, ఎల్ల స్వామి, మందడి వసంత అంజిరెడ్డి, చేగూరి అంజయ్య, ఏసూరి ఐలయ్య, గోవర్ధన్, గోద యాదగిరి, రాజు, నవీన్, యాదయ్య, మల్లేష్ అన్న యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.