బస్తి సంపర్క్ అభినయ్ కార్యక్రమం లో కరపత్రాలు ఆవిష్కరణ

Published: Saturday October 15, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధిభారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా  జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు బస్తి సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో
భాగంగా శుక్రవారం  రోజున భారతీయ జనతా పార్టీ ఎస్సిమోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బచ్చిగళ్ల రమేష్ ఆధ్వర్యంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ  కూడలి అంబెడ్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాల  ఆవరణ లో బస్తి సంపర్క్ అభియాన్ కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా ఒక కమిటీని నియమించడం జరిగింది.ఈ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర బిజెపి ఎస్సిమోర్చా సోషల్ మీడియా కన్వీనర్ కొండ్రు పురుషోత్తం మాట్లాడుతూ బస్తి సంపర్క్ అభియాన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కేంద్రం లో గత 8 సంవత్సరాలలో  నరేంద్రమోదీ ప్రభుత్వం, ఎస్సి ల అభివృద్ధికి  ఏ ఏ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది,తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం ఎస్సిలకు ఇచ్చిన హామీలను ఏవిధంగా విస్మరించింది,అనే అంశం పైన దేశ వ్యాప్తంగా 75వేల బస్తీలలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన తెలిపారు. అందులో మన తెలంగాణలో 5000 వేల బస్తీలలో రంగారెడ్డి జిల్లాలోని 6 నియోజక వర్గాలలో కనీసం 500 బస్తీలలో కార్యక్రమం నిర్వహించాలని  బస్తి సంపర్క్ అభియాన్ కమిటీ నిర్ణయించింది. ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్సిమోర్చా ప్రధాన కార్యదర్శి కొండూరి మనోహర్ ,జిల్లా ఎస్సిమోర్చా ఉపాధ్యక్షుడు సదానందం జిల్లా ఎస్సిమోర్చా కోశాధికారి చిత్రం నరేష్, మున్సిపాలిటీ  ఎస్సిమోర్చా నాయకులు ముదిగొండ నర్సింహ,ఖానపురం లక్ష్మణ్ మరియన్న తదితరులు పాల్గొన్నారు.