పశువులలో కృత్రిమ గర్భధారణ ద్వారా జన్యులక్షణాల అభివృద్ధి ....జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేర

Published: Tuesday December 13, 2022
 మంచిర్యాల బ్యూరో, డిసెంబర్ 12, ప్రజాపాలన  :
 
పశువులలో కృత్రిమ గర్భధారణ ద్వారా జన్యులక్షణాలు అభివృద్ధి చేయవచ్చని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమి, జిల్లా పశువైద్య, పశు సంవర్ధఖ శాఖ అధికారి డా. వై.రమేష్కుమార్తో కలిసి 4వ విడత జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం సంబంధిత గోడప్రతులు, కరపత్రాలను ఆష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 4వ విడత కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని ఆగస్టు 1, 2022 నుండి మే 31, 2023 వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ విధానంలో మేలు జాతి అంబోతులు, దున్నలను వినియోగించడం ద్వారా పాల ఉత్పత్తి పెరిగి రైతులు అధిక లాభాలు పొందుతారని తెలిపారు. ఈ విధానంలో వ్యాధుల వ్యాప్తిని నియంత్రివచ్చని, మేలు జాతి దూడలు జన్మించడం, పాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎంపిక చేయబడిన గ్రామాలలోని పాడి రైతులకు కృత్రిమ గర్భధారణ సౌకర్యాన్ని ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం 10 నెలల పాటు జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమంలో గర్భధారణ చేసిన పశువులకు విశిష్ట సంఖ్యతో కూడిన చెవి పోగు వేస్తారని, ఈ సమాచారం ఐ.ఎన్.ఎ.పి. హెచ్. పోర్టర్లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.